తాంసి మండలం పాలోడి వార్డు మెంబర్ అశోక్, గ్రామస్థులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం కంటే. సంక్షోభం ఎక్కువైందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతానని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలవాలని పార్టీలో చేరిన వారికి సూచించారు.