
కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పతనం: మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శలు
మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామకృష్ణాపూర్లో మాట్లాడుతూ, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రోజురోజుకు దిగజారిపోతోందని, 2019 నుంచే ఆ పార్టీ పతనం మొదలైందని ఆయన అన్నారు. 2023 ఎన్నికల ఓటమితో కేటీఆర్ ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు.































