చెన్నూర్: హార్వెస్టర్ యజమాని దారుణ హత్య

1062చూసినవారు
చెన్నూర్: హార్వెస్టర్ యజమాని దారుణ హత్య
చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన హార్వెస్టర్ యజమాని ముత్యాల శ్రీకాంత్ గౌడ్ (23) బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. మహాదేవపూర్ సీఐ రామచంద్రరావు తెలిపారు. వరి పొలాల కోతల కోసం తన హార్వెస్ట్ తో భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లికి శ్రీకాంత్ గౌడ్ వచ్చాడు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కారులో ఉన్న శ్రీకాంత్ గౌడ్ ను కత్తులతో పొట్టపై నాలుగైదు పోట్లు పొడిచినట్లు పేర్కొన్నారు.