లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

22చూసినవారు
లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఐకేఓసీ సమీపంలో మంగళవారం సాయంత్రం లారీ, బైక్ ఢీకొని తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు తీవ్రంగా గాయపడి తెగిపోయింది. స్థానికులు 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్