మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కపెళ్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఎలాధి శ్రీకాంత్ చేపల వేటకు వెళ్లి కాలువలో జారి గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, శ్రీకాంత్ మృతదేహాన్ని గోదావరిలో వెలికితీశారు. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెన్నూరు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.