
మందమర్రి: అనారోగ్యంతో మావోయిస్టు తల్లి మృతి
మందమర్రి మండలం, ఊరు మందమర్రికి చెందిన మావోయిస్టు రవి తల్లి (80) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటి, చిన్న కుమారుడు రవి. రవి ఇంటర్ చదివే సమయంలో పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1995లో మావోయిస్టు పార్టీలో చేరాడు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశాడు. పోలీసు నిఘా పెరగడంతో పార్టీ అతన్ని ఛత్తీస్గఢ్ కు పంపినట్లు సమాచారం. పదేళ్ల క్రితం తండ్రి దుర్గయ్య మృతి చెందాడు.





































