
భీమారం: నాలుగు లీటర్ల గుడుంబా పట్టివేత
భీమారం మండల కేంద్రానికి చెందిన తేజావత్ తుకారం అనే వ్యక్తి వద్ద నాలుగు లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఎడ్ల బండిని తనిఖీ చేయగా ఈ గుడుంబా దొరికింది. తుకారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.



































