సిహెచ్సి లో అల్ట్రా సౌండ్ స్కాన్ మిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

14చూసినవారు
సిహెచ్సి లో అల్ట్రా సౌండ్ స్కాన్ మిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యే, వేడ్మ బోజ్జు పటేల్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్ సదుపాయం ఖానాపూర్ సిహెచ్సిలో అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అయిన తెలిపారు.

సంబంధిత పోస్ట్