
జన్నారం ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక: సాబీర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవం
జన్నారం పట్టణంలో శుక్రవారం నూతన ఆటో యూనియన్ కమిటీ ఎన్నికైంది. అబ్దుల్ సాబీర్ అధ్యక్షుడిగా, అబ్దుల్ మునీర్ ఉపాధ్యక్షుడిగా, బద్రుద్దీన్ భాష ప్రధాన కార్యదర్శిగా, సలీం కోశాధికారిగా, ఎండి నసీర్, మహమూద్ ఖాన్ ముఖ్య సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.







































