మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) రామారావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక కాంట్రాక్టర్ నుండి లక్షా తొంభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. రామారావు నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.