కాసిపేట: చికిత్స పొందుతూ యువకుడు మృతి

653చూసినవారు
కాసిపేట: చికిత్స పొందుతూ యువకుడు మృతి
కాసిపేట మండలం కోమటి చేను గ్రామపంచాయతీ పరిధి సామగూడలో ఈనెల 5వ తేదీన గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన పేంద్రం శంకర్ (32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారం తెలిపారు. ఒక యువతిని ప్రేమించిన శంకర్, ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు చెప్పి పురుగుల మందు తాగిన శంకర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై వెల్లడించారు.