మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ కార్మికుడు కల్వల లక్ష్మణ్ అనారోగ్యంతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 33 ఏళ్లుగా కాసిపేట ఒకటవ గనిలో హాలర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఆయన, కార్మికుల సమస్యలపై పోరాడిన నాయకునిగా పేరుగాంచారు. మూడుసార్లు కాసిపేట మండల కార్యదర్శిగా, విద్యా కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.