మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మడే నారాయణ (50) అడవికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా పక్షవాతానికి గురయ్యారు. దీంతో ఆయన కాలు, చేయి పనిచేయకుండా పోయాయి. కుటుంబ సభ్యులు ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో ఉండగా మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.