మంచిర్యాల: భారీ వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది

537చూసినవారు
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వడగళ్ల వాన కురిసింది. విపరీతమైన గాలి, వానతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో కాలనీ వాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.