మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

60చూసినవారు
మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
హాజీపూర్ మండలం దొనబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చుంచు వంశీకృష్ణ (24) శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై స్వరూప్ రాజ్ తెలిపారు. దండేపల్లి మండలం కొత్త కొమ్ముగూడెం కు చెందిన వంశీకృష్ణ ఆటోలో మంచిర్యాలలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వ్యాన్ ను ఆటో ఢీకొట్టడంతో వంశీకృష్ణమూర్తి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్