నెన్నెల: వడదెబ్బతో ఒకరి మృతి

300చూసినవారు
నెన్నెల: వడదెబ్బతో ఒకరి మృతి
నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన భోగారపు మారయ్య (56) వడదెబ్బతో మృతి చెందారు. వంట చెరుకు కోసం అడవికి వెళ్లిన ఆయన, గ్రామ శివారు వాగు వద్ద విగత జీవిగా కనిపించారు. దారితప్పి, నీటి కోసం వెతుకుతూ వాగు వద్దకు చేరుకుని వడదెబ్బతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెల 13న చిన్న కూతురి వివాహం చేయాల్సిన తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్