మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోనాపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భర్త వేరే అమ్మాయితో డ్యాన్స్ చేశాడని మనస్తాపానికి గురైన సంధ్య (23) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త జంగు వేరే అమ్మాయితో డ్యాన్స్ చేయడం ఆమెను తీవ్రంగా బాధించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో గురువారం పురుగుల మందు తాగేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.