May 16, 2026, 02:05 IST/
మైనర్పై లైంగిక దాడి.. కానిస్టేబుల్కు 30 ఏళ్ల జైలు శిక్ష
May 16, 2026, 02:05 IST
TG: హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ వరదరాజ్ సుదేష్ అలియాస్ ఉమేష్ (39)కు నాంపల్లిలోని ప్రత్యేక పోక్సోకోర్టు శుక్రవారం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 12వేల జరిమానా చెల్లించాలని, బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2020లో వరుసకు మామ అయిన కానిస్టేబుల్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.