నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూర్ మండలంలోని బొంద్రేట్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గణేష్ పాటిల్ సావలి తన దేశభక్తితో పాటు ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నారు. తనకు వచ్చిన మొదటి ఆర్మీ జీతం నుండి రూ. 21, 000 మొత్తాన్ని గ్రామంలోని హనుమాన్ మందిర ఆలయ నిర్మాణానికి విరాళంగా అందించారు. సోమవారం రోజున తన తాతయ్య అవధూత పాటిల్ చేతుల మీదుగా ఈ విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామ సర్పంచ్ రవీంద్ర పాటిల్ సిందే, వార్డు సభ్యుడు భోజారం పటేల్, ఆలయ కమిటీ ప్రతినిధి నాగేందర్ పాటిల్, గ్రామస్తులు యోధుడు గణేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.