అకాల వర్షంతో రైతుల అవస్థలు

523చూసినవారు
సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తడిపివేసింది. టార్పాలిన్లు ఏర్పాటు చేసినా, ధాన్యపు బస్తాలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూకం వేయకపోవడం, తడిసిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు.