నిర్మల్ జిల్లా పెంబి మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొరకంటి తండాకు చెందిన రాథోడ్ అర్జున్, ఆయన కుమారుడు రాథోడ్ శ్రీనివాస్ ఇంట్లోని ఐరన్ కూలర్‌లో నీరు పోస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందారు. వారిని కాపాడే ప్రయత్నంలో రాథోడ్ అర్జున్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.