కోలూర్ లో ఘనంగా ‘వికాసిత్ గ్రామ పంచాయతీ’ మొదటి గ్రామ సభ

5చూసినవారు
కోలూర్ లో ఘనంగా ‘వికాసిత్ గ్రామ పంచాయతీ’ మొదటి గ్రామ సభ
​తానూర్ మండలంలోని కోలూర్ గ్రామంలో 'వికాసిత్ భారత్ గ్యారెంటీ' (వీబీజీ) పథకంలో భాగంగా మొదటి గ్రామసభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. 'వికాసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక' తయారీయే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ​ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి సరైన ప్రణాళికల రూపకల్పన ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్