బోరిగాం బాలాజీ గుట్ట వద్ద పులి హల్‌చల్

0చూసినవారు
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూర్ మండలం బోరిగాం బాలాజీ గుట్ట వద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ​శనివారం రోడ్డుపై ప్రత్యక్షమైన పులిని చూసి ద్విచక్ర వాహనదారులు కేకలు వేయడంతో అది గుట్టల్లోకి వెళ్లిపోయింది. మళ్లీ ఆదివారం ఉదయం 5: 30 గంటలకు రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేయగా వాహనదారులు వీడియో తీశారు. నెల రోజులుగా సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్