నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామంలో చేపల వేటకు వెళ్లి వల చిక్కుకొని రాజమండ్రికి చెందిన గోవింద్ (34) అనే వలస కూలీ మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు బాబాపూర్ పెద్ద చెరువులో చేపలు పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.