
జెడ్పీఎచ్ఎస్లో జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీలు
కాగజ్నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సోమవారం జోనల్ స్థాయి అండర్-14 బాక్సింగ్ పోటీలు జరిగాయి. రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్ఐ సందీప్ ప్రారంభించిన ఈ పోటీల్లో అండర్-14లో విక్రమ్ తేజ 28–30 కిలోల వర్గంలో గోల్డ్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. అండర్-19లో సుమిత్ తివారి, అంకిత్, ప్రభాత్ గోల్డ్ మెడల్స్ సాధించి వరంగల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారు. ఈ వివరాలను ఎస్జిఎఫ్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు.

































