ఉట్నూర్: జూన్ 3 వరకు దరఖాస్తు గడువు పెంపు

0చూసినవారు
ఉట్నూర్: జూన్ 3 వరకు దరఖాస్తు గడువు పెంపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును జూన్ 3 వరకు పొడిగించారు. ఐటీడీఏ పీవో మంద మకరందు ఈ విషయాన్ని తెలిపారు. ప్రవేశ పరీక్ష జూన్ 5న ఉట్నూర్‌లోని బి.ఎడ్ కళాశాలలో నిర్వహించబడుతుంది. ఆసక్తిగల విద్యార్థులు ఐటీడీఏలోని డిప్యూటీ డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.