
హైవేపై బైక్-కారు ఢీ.. గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్ (వీడియో)
హర్యానాలోని గురుగ్రామ్‌లో సోమవారం ఉదయం అంబియన్స్ మాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న క్యాబ్ అకస్మాత్తుగా లేన్ మారడంతో, అదే లేన్‌లో వస్తున్న బైకర్ దానిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకర్ గాలిలోకి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో బైకర్పై అమర్చిన కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




