అడోబ్ ఫొటోషాప్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా రిలీజ్ చేసిన ఈ ఫీచర్ ద్వారా ముఖ్యమైన ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ను నేరుగా బ్రౌజర్‌లోనే ఉపయోగించవచ్చు. డిసెంబర్ 8లోపు ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి అడోబ్ 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఇస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, కలర్–ఎక్స్‌పోజర్ అడ్జస్ట్‌మెంట్, సోషల్ మీడియా డైమెన్షన్లకు అనుగుణంగా క్రాప్ చేసే ఫీచర్లు ఇందులో లభ్యమవుతున్నాయి.