మధ్యప్రదేశ్‌లో ఇటీవల దారుణ వెలుగు చూసింది. ఓ యువతి తన బావ శ్రీజన్ సాహుతో ఎఫైర్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సదరు యువతికి పెళ్లి ఫిక్స్ అయింది. దీంతో ప్రియురాలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శ్రీజన్ వేధింపులు తట్టుకోలేక, యువతి సాహిల్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి హత్యకు ప్లాన్ వేసింది. శ్రీజన్‌కు ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్‌కు పిలిచి, మార్గమధ్యలో కత్తితో పొడిచి చంపి, శవాన్ని అడవిలో పూడ్చిపెట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.