ఎఫైర్.. కుమారుడి కళ్లెదుటే తల్లి గొంతుకోసి దారుణ హత్య

2చూసినవారు
ఎఫైర్.. కుమారుడి కళ్లెదుటే తల్లి గొంతుకోసి దారుణ హత్య
TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ ఠాణా పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నగరంలో నివసించే కిషన్ కు బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ భవనం ఉంది. స్వాతి(28)అనే మహిళ పిల్లలతో కలిసి ఆ భవనంలో ఉంటోంది. ఈ క్రమంలో ఇంటి యజమానితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే శనివారం గుర్తుతెలియని వ్యక్తులు స్వాతి ఇంట్లోకి ప్రవేశించి కుమారుడు చూస్తుండగానే ఆమెను గొంతుకోసి హత్య చేశారు. నిందితుల్లో ఒకరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్