అఫ్గానిస్థాన్ మరోసారి ఉగ్ర స్థావరంగా మారకూడదని భారత్ స్పష్టం చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలు అఫ్గాన్ భూభాగాన్ని తమ కార్యకలాపాలకు వేదికగా వాడకుండా చూడాలని ఐరాస సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్‌లో భద్రతా పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని ఆయన అన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రతకు అఫ్గాన్‌లో ఉగ్రవాదం పెరగకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు.