ఒకప్పుడు వెండితెరపై వెలిగిన నటి, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆర్కే రోజా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమలో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 'లెనిన్ పాండియన్' సినిమాతో ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆమె 'శాంతనం' అనే పాత్రలో సహజమైన, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించనున్నారు. 'లెనిన్ పాండియన్'తో పాటు, 'జమా' చిత్ర దర్శకుడు పారి ఎలవళగన్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యే అవకాశాలున్నాయి.