రానున్న ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఓట్ చోరీ, ఎస్ఐఆర్ ద్వారా అక్రమంగా గెలవాలని చూస్తోందని fవ్యాఖ్యానించారు. రాజ్యాంగం ఉంటేనే రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో నిర్వహించిన మహా ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.