ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్న అఘోరీ (వీడియో)

12551చూసినవారు
తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ మాత గురువారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అఘోరీని చూసేందుకు, ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిమాలయాలను వదిలి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పిన అఘోరీ తన మాటలు, చర్యలతో వివాదస్పద మయ్యారు. కొద్ది రోజులుగా ఏపిలోని శైవ క్షేత్రాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్