
మెసేజింగ్ యాప్‌లకు కొత్త సైబర్ రూల్స్: సిమ్ లింక్ తప్పనిసరి!
భారత ప్రభుత్వం కొత్త సైబర్ సెక్యూరిటీ నియమాలను ప్రవేశపెట్టింది. దీనితో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో మార్పులు రానున్నాయి. యూజర్లు యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా ఈ యాప్‌లను ఉపయోగించలేరు. యూజర్ వాడుతున్న సిమ్ కార్డ్ 90 రోజులు యాప్‌తో లింక్ అయి ఉండాలి. వెబ్ బ్రౌజర్లో లాగిన్ అయ్యేవారిని ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ ఔట్ చేసి, QR కోడ్ ద్వారా రీ-వెరిఫికేషన్ చేయాలి. ఈ చర్యల ద్వారా నేరస్థులు నకిలీ లాగిన్లు చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.




