తెలంగాణలో ఈ నెల 10 నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

73చూసినవారు
తెలంగాణలో ఈ నెల 10 నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ
తెలంగాణ యువత కోసం భారత ఆర్మీ 'అగ్నివీర్' నియామక ర్యాలీని హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 22 వరకు నిర్వహించనుంది. చెన్నై జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సమన్వయంతో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ ర్యాలీ జరుగుతుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ వంటి పోస్టులకు పదో తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్