AIతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం: బిల్ గేట్స్ హెచ్చరిక

12చూసినవారు
AIతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం: బిల్ గేట్స్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దుర్వినియోగమైతే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు. ఎన్‌బీసీ ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శక్తివంతమైన ఏఐ సాధనాలు చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బిలియన్‌ మంది ప్రాణాలు కోల్పోయే స్థాయి ఘటనలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఏఐ భద్రతకు ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ఏఐ వల్ల సైబర్‌ దాడులు, మోసాలు, తప్పుడు సమాచార ప్రచారం వంటి ముప్పులు పెరిగే అవకాశం ఉన్నందున పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్