ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వడ్డీ వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
Sep 23, 2025, 08:09 IST/

వడ్డీ వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

Sep 23, 2025, 08:09 IST
AP: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డిని శుక్రవారం కిడ్నాప్ చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన నలుగురు కిరాయి హంతకులు వేణుగోపాల్ రెడ్డిని కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని వేణుగోపాల్ రెడ్డి బతిమాలినా దుండగులు కనికరించలేదని తెలిసింది. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కుందు నదిలో పడేసి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం.