రైతులు తమ పొలాలపై ఇంటి నుంచే నిఘా పెట్టేందుకు ఇంటిగ్రేటెడ్ AI సోలార్ సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కెమెరాలు జంతువులు, దొంగల కదలికలను వెంటనే గుర్తించగలవు. రెండు కిలోమీటర్ల పరిధి వరకు పనిచేసే ఈ కెమెరాల్లో స్పీకర్లు కూడా ఉన్నాయి, వీటితో కోతులు, అడవి పందులను భయపెట్టవచ్చు. 360 డిగ్రీలు, నైట్ కలర్ విజన్ తో 24 గంటల పర్యవేక్షణ అందిస్తాయి. కరెంట్, వైఫై అవసరం లేకుండా సోలార్ పవర్ తో పనిచేసే ఈ కెమెరాలు 20 నుంచి 25 రోజుల వరకు వీడియో డేటాను భద్రపరుస్తాయి.