కోవిడ్ సమయంలో అమెరికాలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడి ఆరోగ్య సమస్యకు సమాధానం కోసం 17 మంది వైద్యులను సంప్రదించింది. అయినా కారణం గుర్తించలేకపోయారు. చివరికి ChatGPT సాయాన్ని తీసుకుంది. MRI స్కాన్, లక్షణాల వివరాలు ఇచ్చిన తల్లి ప్రశ్నకు ChatGPT ‘టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్’ అని చెప్పింది. దీన్ని ఆధారంగా తీసుకుని వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటన AI కీలకతను రుజువు చేసింది.