ఆస్ట్రేలియా ప్రభుత్వ పోర్టల్‌లోకి ఏఐ చొరబాటు.. ఆందోళనలో దేశం

8855చూసినవారు
ఆస్ట్రేలియా ప్రభుత్వ పోర్టల్‌లోకి ఏఐ చొరబాటు.. ఆందోళనలో దేశం
ఆస్ట్రేలియాలో ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్‌ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ప్రధాని ఆంథనీ అల్బనీస్‌ వెల్లడించారు. జూన్‌ 18న జరిగిన ఈ ఘటనపై సెప్టెంబర్‌ 10న ప్రభుత్వానికి సమాచారం అందింది. పరిశోధనలో భాగంగా ఏఐ ఏజెంట్‌ మెడికేర్‌ స్టాటిస్టిక్స్‌ రిపోర్టింగ్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించింది. కొన్ని పబ్లిక్‌, నాన్‌-పబ్లిక్‌ ఫైళ్లను యాక్సెస్‌ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వ్యక్తిగత ఆరోగ్య సమాచారం లీక్‌ కాలేదని ప్రభుత్వం, ఓపెన్‌ఏఐ పేర్కొన్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఫోరెన్సిక్‌ దర్యాప్తు ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్