ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు!
Jun 03, 2026, 11:06 IST/

త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు!

Jun 03, 2026, 11:06 IST
దేశంలో త్వరలోనే సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో నగదుకు పెరుగుతున్న డిమాండ్, కాగితపు నోట్ల ముద్రణ భారం దృష్ట్యా RBI ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నోట్ల ప్రవేశంపై చర్చించారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ, మార్కెట్లో నగదు చలామణి రూ. 42.86 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు ఆర్‌బీఐ రూ. 6,372.8 కోట్లు ఖర్చు చేసింది. ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి.