ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పరువు నష్టం, మహిళను అవమానించడం, ఐటీ యాక్ట్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకున్నారు. వీడియోపై బీజేపీ తీవ్రంగా స్పందించగా, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సమర్థించుకునే ప్రయత్నం చేశారు.