TG: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. సురేఖపై వేటు వేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలిసింది. మల్లికార్జున ఖర్గేను కలిసిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు దీనిని మరింత బలం చేకూర్చుతున్నాయి. సురేఖతోపాటు చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించడానికి అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం సురేఖ తొలగింపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు.