TG: రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ రాలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. 'అభ్యర్థుల ఎంపికపై మరో సారి చర్చిస్తామని రాహుల్ అన్నారు. రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేం. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుంది' అని తెలిపారు.