ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. జైపూర్ నుంచి ముంబయి వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన 18 నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్లు బయల్దేరిన ప్రాంతంలోనే మళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే.