కోల్‌కతా విమానాశ్రయం రన్ వే హాంగర్‌లో 13 ఏళ్ల క్రితం రికార్డుల నుంచి మాయమైన ఎయిర్ ఇండియా బోయింగ్ 737-200 విమానం బయటపడింది. 43 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విమానాన్ని ఇంజనీర్ల శిక్షణ కోసం ఇంజిన్‌తో సహా బెంగళూరు తరలించారు. ప్రైవేటీకరణ సమయంలో రికార్డుల నుంచి మర్చిపోవడం వల్లే ఈ విమానం కనిపించకుండా పోయిందని ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. 1982లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన ఈ విమానం, పలు మార్పుల తర్వాత 2012లో రిటైర్ అయింది.