జమ్మూకశ్మీర్‌లో పూంచ్‌లోని నగల దుకాణంలో ఏకే-47 తూటాలు, పాకిస్థాన్ కరెన్సీ, పోస్టర్లు, జెండాలు లభించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఉగ్రవాద కోణంలో విచారణ చేపట్టినప్పటికీ.. ప్రస్తుతం వ్యాపార శత్రుత్వం, కుట్ర కోణాలనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు ఓ కుటుంబాన్ని ఉగ్ర కేసులో ఇరికించేందుకు ఈ సామగ్రిని దుకాణంలో ఉంచి ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.