
ఏపీ టిడ్కోకు రూ. 540 కోట్లు మంజూరు
AP: టిడ్కోకు రూ.540 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ఈ నిధులు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణంగా పరిగణించి మంజూరు చేసిన ఈ మొత్తానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.




