నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ 2' సినిమాపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారని అందులో ఒకటి అఘోర పాత్ర కాగా మరొకటి హిందూపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ పాత్ర అని సమాచారం. ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో వచ్చిన 'అఖండ' కన్నా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటాయని టీమ్ చెబుతోంది.